Hero Suhas : మందాడిలో ప్ర‌తి నాయ‌కుడిగా సుహాస్

తొలిసారిగా త‌మిళ మూవీలో హీరో

Suhas : రాను రాను ప్రాంతాలు, భాష‌ల మ‌ధ్య భేదాలు తొల‌గి పోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు సినీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. క‌థ బ‌లంగా ఉంటే చాలు మూవీస్ త‌ప్ప‌కుండా ఆడతాయ‌నే న‌మ్మ‌కంతో ఏ ప్రాంతానికి చెందిన వార‌నేది ప‌ట్టించు కోవ‌డం మానేశారు. ఇటీవ‌లే త‌మిళ సినీ రంగానికి చెందిన మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం డ్రాగ‌న్ . ఇందులో కీల‌క పాత్ర పోషించాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కాయ‌తు లోహ‌ర్. త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన ఈ మూవీ ఏకంగా రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది.

Suhas Movie Updates

ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన కోర్ట్ సైతం బిగ్ హిట్ గా నిలిచింది. త‌మిళ చిత్రం అయిన‌ప్ప‌టికీ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. బిగ్ రెస్పాన్స్ వ‌చ్చింది డ్రాగ‌న్ కు. తాజాగా టాలీవుడ్ కు చెందిన హీరో సుహాస్(Suhas) తొలిసారిగా త‌మిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సూరి కీల‌క పాత్ర పోషిస్తున్న చిత్రం మందాడి. ఇందులో త‌ను ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. ఇందుకు సంబంధించి మూవీ మేక‌ర్స్ ఇటీవ‌లే హీరో సూరి పోస్ట‌ర్ ను రిలీజ్ చేయ‌గా తాజాగా సుహాస్ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మూవీ మేక‌ర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక మందాడి మూవీకి మ‌తి మార‌న్ పుగళేంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఈ సంద‌ర్బంగా సుహాస్ స్పందించాడు త‌న పాత్ర గురించి. ఇందులో విల‌న్ గా మాత్ర‌మే న‌టిస్తున్నాన‌ని, మొత్తం కీ రోల్ మాత్రం సూరి పోషిస్తున్నాడ‌ని చెప్పాడు. సూరి అన్న‌తో సముద్రాన్ని స్వారీ చేసి పాలించేందుకు నేను ఇక వేచి ఉండ‌లేన‌ని అన్నాడు. త‌ను చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Hero Ram-Bhagyashri Borse :భాగ్యశ్రీ బోర్సేకు రామ్ ప్రేమ ప‌ల‌క‌రింపు

MoviesSuhasUpdatesViral
Comments (0)
Add Comment