Actor Trisha : విక్టరీ వెంకటేష్ తో నాలుగో సినిమాకు సైన్ చేసిన త్రిష

పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది

Actor Trisha : టాలీవుడ్‌లో మరో హిట్ కాంబో రాబోతుంది. విక్టరీ వెంకటేష్ మరియు త్రిష(Trisha) తెలుగు నాట సక్సెసఫుల్ కాంబినేషన్. వీరిద్దరూ ‘ఆడవారి మాటలకూ అర్ధాలేవేరులే’, ‘నమో వెంకటేశా’, ‘బాడీగార్డ్’ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు ఈ జంట ఓ సినిమాలో కనిపించబోతున్నారు. ‘ఎఫ్2’ సిరీస్ చిత్రాలతో అలరించిన వెంకటేష్, అనిల్ రావిపూడి మరో చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. కథ దాదాపు అయిపోయింది. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. త్రిషనే దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Actor Trisha Movie Updates

పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. వచ్చే సంక్రాంతికి తన సొంత బ్యానర్‌పై ‘శతమానం భవతి’ పార్ట్ 2ని విడుదల చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను వెంకీ, అనిల్ లు తెరకెక్కిస్తారని ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి సమాచారం.

Also Read : Rakul Preet Singh: గోవాలో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ! 

MoviesTrendingTrisha KrishnanUpdatesvictory venkateshViral
Comments (0)
Add Comment