Victory Venkatesh : నాదంతా వైట్ మ‌నీ – విక్ట‌రీ వెంక‌టేశ్

సంక్రాంతికి వ‌స్తున్నాం స‌క్సెస్ మీట్

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా రూ. 230 కోట్లు వ‌సూలు చేసింది వ‌ర‌ల్డ్ వైడ్ గా . ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా ఇర‌గ‌దీశాడు ద‌ర్శ‌కుడు. స‌క్సెస్ మీట్ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు వెంకీ. ఈడీ దాడులు స‌హ‌జ‌మేన‌ని, తాను వైట్ మ‌నీనే తీసుకుంటాన‌ని చెప్పారు.

Victory Venkatesh Comment

త‌మ సినిమా నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ల‌పై ఆదాయ ప‌న్ను శాఖ దాడులు చేయ‌డం గురించి త‌న‌కు ఏ మాత్రం తెలియ‌ద‌న్నారు. అయినా వాటిన‌న్నింటిని తాను ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశారు. బ్లాక్ మ‌నీ తీసుకునే వాళ్లకు ఆ భ‌యం ఉంటుంద‌న్నారు.

తాను అతి త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటాన‌ని, త‌న‌పై దాడులు చేస్తార‌ని, సోదాలు చేప‌డ‌తార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. ఇక అనిల్ రావిపూడి ఇంటి మీద కూడా ఈడీ రైడ్ చేసింద‌న్న ప్ర‌శ్న‌కు డైరెక్ట‌ర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. తాను ఆ స్థాయికి ఎద‌గ‌లేద‌న్నారు.

Also Read : Beauty Anupama : ఆస‌క్తి రేపుతున్న అనుమ‌మ ‘ప‌ర‌దా’

CinemaCommentsSankranthiki Vasthunnamvictory venkateshViral
Comments (0)
Add Comment