Hero Vishal Health :న‌టుడు విశాల్ ఆరోగ్యం ప‌దిలం

ఆస్ప‌త్రి నుంచి యాక్ట‌ర్ డిశ్చార్జ్

Vishal : త‌మిళ సినీ న‌టుడు విశాల్ (రెడ్డి) ఆస్ప‌త్రి నుంచి విడుద‌ల‌య్యారు. ఆయ‌న ఆరోగ్యం కుద‌ట ప‌డ‌డంతో ఇంటికి పంపించిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా వ‌ల్లీపురం లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వేదిక‌పై ఉండ‌గా ఉన్న‌ట్టుండి స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. దీంతో హుటా హుటిన త‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. అభిమానులు తీవ్ర ఆందోళ‌న చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌మ అభిమాన న‌టుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతూ ప్రార్థ‌న‌లు చేశారు.

Vishal Health Updates

ఈ స‌మ‌యంలో ఈ ఏడాది విశాల్(Vishal) వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, అంజలితో క‌లిసి న‌టించిన మ‌న్మ‌థ రాజా చిత్రం సూప‌ర్ హిట్ అయ్యింది. ప్ర‌ముఖ త‌మిళ సీనియ‌ర్ న‌టుడు నిర్మించారు. ఆశించిన దాని కంటే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది . అయితే విశాల్ కోలీవుడ్ లో అత్యంత ఫిట్ నెస్ క‌లిగిన న‌టుడిగా గుర్తింపు పొందాడు. కానీ ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ వ్యాధి అనేది బ‌య‌ట‌కు వెళ్ల‌డించ‌లేదు.

ఈ సంద‌ర్బంగా అభిమానులు తీవ్ర ఆందోళ‌న చెందుతుండ‌డంతో న‌టుడు విశాల్ కు సంబంధించిన ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని, ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు. ట్రాన్స్ జెండ‌ర్స్ కోసం నిర్వ‌హించిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. అల‌స‌ట కార‌ణంగా స్పృహ త‌ప్పి ప‌డి పోయార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉంద‌న్నారు.

Also Read : IPL 2025 Sensational :ఫ్యాన్స్ కు ఖుష్ ఖ‌బ‌ర్ ఐపీఎల్ రీ స్టార్ట్

Health ProblemsHero VishalUpdatesViral
Comments (0)
Add Comment