Adah Sharma : కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నటి అదా శర్మ

ఆ సమయంలో మనం ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలి...

Adah Sharma : క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై అదా శర్మ మరోసారి స్పందించారు. తాజాగా నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను షేర్‌ చేసుకున్నారు. ఎప్పుడైన క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నారా..? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘నిజం చెప్పాలంటే.. నేను నేల మీదనే కూర్చున్నాను.. సోఫా(కౌచ్‌)లో కూర్చోవాలని అనుకోలేదు’ అన్నారు. ‘ మనం సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిసస్తామో.. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించాలని చూేస్త అంతే వేగంగా కనిపెట్టాలి.

Adah Sharma Comment

ఆ సమయంలో మనం ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలి. పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. ఏ రంగంలోనైనా సపోర్ట్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉండడం ముఖ్యం. నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నాను’ అని వివరించారు. 2008 కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు అదాఽశర్మ వివరించారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైౖర్యంగా ముందుకు వెళ్లినట్లు చెప్పారు. ‘ హార్ట్‌ ఎటాక్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరచియమైన అదాశర్మ. ‘ సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘గరం’, ‘క్షణం’, ‘కల్కి’ చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన ‘కేరళ స్టోరీ’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదా నటించిన ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్గిత్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Devara: యు.ఎస్‌లో ప్రీ సేల్స్‌ లో రచ్చరంబోలా చేస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ !

Adah Sharmacasting coutchCommentsViral
Comments (0)
Add Comment