Katrina Kaif : బాలీవుడ్ బ్యూటీగా పేరు పొందిన కత్రినా కైఫ్ సంచలనంగా మారింది. తను గతంలో పలు చిత్రాలలో నటించింది. హృదయాలను దోచుకుంది. తను ఇటు హిందీ సినిమాలతో పాటు అటు తెలుగులో కూడా తళుక్కున మెరిసింది. విక్టరీ వెంకటేశ్ సరసన స్క్రీన్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మల్లీశ్వరి చిత్రం బిగ్ సక్సెస్ అయ్యింది. ఇందులో సన్నివేశాలు, సంభాషణలు కెవ్వు కేక అనిపించేలా చేశాయి. కాసుల వర్షం కురిపించేలా చేసింది. ఆ తర్వాత తను బాలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీ రోల్స్ పోషించింది కత్రీనా కైఫ్.
Katrina Kaif in Telugu Movie
ఇదిలా ఉండగా టాలీవుడ్, బాలీవుడ్ లలో గతంలో సూపర్ సక్సెస్ అయిన మూవీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. మరో వైపు టాప్ హీరోయిన్లుగా కొనసాగిన అలనాటి సీనియర్ హీరోయిన్లు సైతం తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. హేమ మాలిని, మాధురీ దీక్షిత్, రేఖ, రవీనా టాండన్, జయసుధ, విజయశాంతి, తదితర హీరోయిన్లు మూవీస్ లో తలుక్కున మెరిశారు. ఇక కత్రీనా కైఫ్(Katrina Kaif) విషయానికి వస్తే బాక్సాఫీస్ ను తన అందచందాలతో షేక్ చేసింది. బీటౌన్ లో ఆడియన్సన్ డ్రీం గర్ల్ గా అదరగొట్టింది.
కత్రీనా కైఫ్ తన సినీ కెరీర్ ను 2003లో ప్రారంభించింది. ఆనాటి నుంచి నేటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తోంది. గత ఏడాది 2024లో మెర్రీ క్రిస్మస్ మూవీలో నటించింది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్గుగుమ్మ. త్వరలో హౌజ్ ఫుల్ 5 సీక్వెల్ మూవీతో రాబోతోంది. పెళ్లి జరిగినా తనలో ఏ మాత్రం అందం తగ్గడం లేదంటూ దూసుకు పోతోంది. యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. ప్రస్తుతం భారతీయ సినిమాను టాలీవుడ్ డామినేట్ చేస్తోంది. ప్రతి మూవీ ఇక్కడి నుంచి తయారై పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాయి. ఛాన్స్ వస్తే తాను నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించింది.
Also Read : Shobhitha Shocking :ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా అబద్దం – శోభిత