త‌మ్ముడైనా నితిన్ రెడ్డిని గ‌ట్టెక్కిస్తుందా..?

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీ ట్రైల‌ర్

ఈ ఏడాది నితిన్ రెడ్డికి ఆశించిన స‌క్సెస్ రాలేదు. త‌ను శ్రీ‌లీలతో క‌లిసి న‌టించిన వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాబిన్ హుడ్ బోర్లా ప‌డింది. త‌ను ఉన్నా వ‌ర్క‌వుట్ కాలేదు. జీఎస్ ప్ర‌కాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. కానీ క‌థ‌ను ఎంచుకోవ‌డం, చెప్ప‌డంలో వెంకీ ఫెయిల్ అయ్యాడు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ లేక పోయాడు. కంటెంట్ లో ద‌మ్ముంటే ఇక మూవీ త‌నంత‌ట అదే స‌క్సెస్ అవుతుంది. భారీ చిత్రాలు బోర్లా ప‌డ్డాయి. వాటిలో మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్. దెబ్బ‌కు సైలెంట్ అయి పోయాడు చెర్రీ. కానీ ఇదే స‌మ‌యంలో విక్ట‌రీ వెంక‌టేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాంతో. ఏకంగా ఈ చిత్రం రూ. 300 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇక ఇదే ఏడాది ఆరు నెల‌ల్లో వ‌చ్చిన చిత్రాల‌లో చిన్న మూవీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. మారి ముత్తు తీసిన డ్రాగ‌న్ సంచ‌లనం క‌లిగించింది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, క‌యాదు లోహ‌ర్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ న‌టించారు. ఇది రూ. 100 కోట్ల‌ను దాటేసింది. ఇక నాని నిర్మించిన కోర్టు దుమ్ము రేపింది. ఆ త‌ర్వాత నాగ‌వంశీ తీసిన మ్యాడ్ స్క్వేర్ బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. ఇది సీక్వెల్ మూవీ. ఇక తాజాగా రిలీజ్ అయిన గీతా ఆర్ట్స్ ప‌తాకంపై విడుద‌ల చేసిన సింగిల్ సూప‌ర్ బ్రో అనేలా ఉంది.

కానీ నితిన్ రెడ్డికి ఇప్ప‌టికింకా ఒక్క హిట్టు రాలేదు. తాజాగా త‌ను న‌టిస్తున్న త‌మ్ముడు చిత్రానికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. దీనికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఇక గ‌తంలో సూప‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఆ త‌ర్వాత తెరకు దూరంగా ఉన్న న‌టి ల‌య తిరిగి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్ సోద‌రిగా న‌టించింది.

Comments (0)
Add Comment