Beauty Mamatha Kulkarni : స‌న్యాసినిగా మారిన న‌టీమ‌ణి

మ‌మ‌తా కుల‌క‌ర్ణి సంచ‌ల‌న నిర్ణయం

Mamatha Kulkarni : యూపీ లోని ప్ర‌యాగ్ రాజ్ లో మ‌హా కుంభ మేళా కొన‌సాగుతోంది. జ‌న‌వ‌రి 13న ప్రారంభ‌మైన ఈ మేళా వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 11 కోట్ల మందికి పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు ప్ర‌క‌టించింది యూపీ స‌ర్కార్. ఇప్ప‌టికే భార‌త దేశానికి చెందిన భ‌క్తుల‌తో పాటు వివిధ దేశాల‌కు చెందిన సెలిబ్రిటీలు, ప్ర‌ముఖులు, వివిధ రంగాల‌కు చెందిన వారంతా ప్ర‌యాగ్ రాజ్ బాట ప‌ట్టారు. ఇక చ‌ల‌న చిత్ర సీమ రంగానికి చెందిన వారు కూడా త‌ళుక్కున మెరుస్తున్నారు.

Mamatha Kulkarni..

తాజాగా ఒక‌ప్పుడు బాలీవుడ్ ను త‌న న‌ట‌న‌తో , సినిమాల‌తో షేక్ చేసిన న‌టి మ‌మ‌తా కుల‌క‌ర్ణి(Mamatha Kulkarni) అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. కుంభ మేళాలో ప‌విత్ర స్నానం చేశారు. ఆ వెంట‌నే స‌న్యాసం తీసుకున్నారు. ఈ న‌టీమ‌ణి ఇక నుంచి తాను స‌న్యాసినినంటూ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

త‌న అందం, అభియ‌నంతో మ‌న‌సు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ త‌న కెరీర్ బాగున్న‌ప్పుడే వ‌ద్ద‌నుకుని చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యారు. 25 ఏళ్ల త‌ర్వాత తిరిగి ప్ర‌త్య‌క్షం అయ్యారు. కిన్నార్ అఖారాలో ఆచార్య మ‌హా మండ‌లేశ్వ‌ర్ డాక్ట‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ త్రిపాఠి స‌మ‌క్షంలో స‌న్యాస దీక్ష చేప‌ట్టారు. త‌న పేరును కూడా మార్చేసుకుంది ఈ న‌టి. శ్రీ‌యామై మ‌మ‌త నంద‌గిరిగా పిల‌వాల‌ని కోరింది. 29న రాజ స్నానం చేస్తాన‌ని, ఆ వెంట‌నే అయోధ్య‌ను సంద‌ర్శిస్తాన‌ని అక్క‌డ భారీ విరాళం ఇస్తానంటూ ప్ర‌క‌టించింది.

Also Read : Janhvi Kapoor Interesting : శ్రీ‌వారి స‌న్నిధి లోనే శేష జీవితం

Indian ActressesUpdatesViral
Comments (0)
Add Comment