Beauty Manisha Koirala :నాకు ఓ తోడు కావాల‌ని ఉంది

బాలీవుడ్ బ్యూటీ మ‌నీషా కోయిరాలా

Manisha Koirala : అందాల ముద్దుగుమ్మ మ‌నీషా కోయిరాలా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. తెలుగు, బాలీవుడ్ ల‌లో ఒక వెలుగు వెలిగింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంది. అప్పుడ‌ప్పుడు ఈవెంట్స్ లో క‌నిపిస్తూ వ‌స్తోంది. త‌ను తీవ్ర‌మైన మ‌నోవేద‌న‌కు గురైంది. ఆ త‌ర్వాత అనారోగ్యం ఆమెను వెంటాడింది. ఇదే స‌మ‌యంలో త‌న కెరీర్ లో చాలా మందితో డేటింగ్ చేసిన‌ట్లు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

Manisha Koirala Key Comments

చివ‌ర‌కు నానా ప‌టేక‌ర్ తో పెళ్లికి కూడా సిద్ద‌మైన‌ట్లు పుకార్లు షికార్లు చేశాయి. మ‌నీషా కోయిరాలా(Manisha Koirala) ప‌టేక‌ర్ తో పాటు డీజే హుస్సేన్ , సెసిల్ ఆంథోనీ, వివేక్ ముష్రాన్, ప్ర‌శాంత్ చౌద‌రి, ఆర్య‌న్ వేద్ , తారిఖ్ ఫ్రేమ్జీ, క్రిస్పిన్ కాన్రాయ్ , రాజీవ్ ముల్చందాని , క్రిస్టోఫ‌ర్ డోరిస్ ల‌తో త‌ను స‌న్నిహితంగా మెలిగిన‌ట్లు సినీ లోకం కోడై కూసింది.

ఈ త‌రుణంలో తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా మ‌నీషా కోయిరాలా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నేను జీవితంలో చాలా త‌ప్పు చేశాన‌ని అనిపిస్తోంది. ప్ర‌స్తుతం నాకు 50 ఏళ్ల‌కు పైగా వ‌చ్చేశాయి. ఈ త‌రుణంలో నాకంటూ ఓ తోడు కావాల‌ని అనిపిస్తోంది. నేను త‌ప్పు వ్య‌క్తుల‌ను న‌మ్మాను..మోస పోయాన‌ని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ ఎందుక‌నో న‌న్ను ప్రేమించి అర్థం చేసుకునే వాడై ఉంటే బావుండ‌న‌ని పిస్తోంద‌ని పేర్కొంది మ‌నీషా కోయిరాలా. తాజాగా త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Popular Actor Shiva Rajkumar :ఓటీటీలో శివ‌న్న భైర‌తి ర‌ణ‌గ‌ల్

CommentsManisha KoiralamarriageTrending
Comments (0)
Add Comment