Ramya Krishnan : కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నటి రమ్య కృష్ణ

తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది....

Ramya Krishnan : కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఓ వ్యక్తి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో చెప్పారు. కొంత మంది సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది హీరోయిన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు. స్టార్ హీరోయిన్లు, యంగ్ ఆర్టిస్టులు కూడా లైంగిక వేధింపులపై బహిరంగంగానే మాట్లాడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. 1990లలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు ప్రతి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆమె నటించింది.

Ramya Krishnan Comment

తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా గుంటూరు కారంలో రమ్యకృష్ణ నటించింది. తాజాగా రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేసింది. రమ్యకృష్ణ నాలుగు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు మరియు మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.

కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా పరిశ్రమకే కాదు’ అని రమ్యకృష్ణ(Ramya Krishnan) ఇటీవల అన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని రమ్యకృష్ణ అన్నారు. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తెరపై కనిపిస్తుండడంతో సినీ పరిశ్రమ అందరి దృష్టిలో పడింది. కొంతమంది తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి తొందరపడుతుంటారు. సినిమా తారలు కావడానికి హీరోయిన్లు కొన్నిసార్లు అలవాటు పడాల్సి వస్తుందని రమ్యకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ వ్యాఖ్యలపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Alia Bhatt: డీప్ ఫేక్ బారిన బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ !

BreakingCommentsRamya KrishnanViral
Comments (0)
Add Comment