Rekha Viral : నెట్టింట్లో రేఖ వైర‌ల్

వ‌య‌సు పెరిగినా త‌గ్గ‌ని అందం

Rekha Viral : భార‌తీయ సినీ రంగంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ న‌టి ఎవ‌రైనా ఉన్నారంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది రేఖ‌. త‌ను ఏ పాత్ర‌లోనైనా జీవిస్తుంది. దానికి ప్రాణం పోస్తుంది. విచిత్రం ఏమిటంటే ఆమె తండ్రి ప్ర‌ముఖ న‌టుడు అని ఎవ‌రికీ తెలియ‌దు. త‌మిళ సినీ రంగానికి చెందిన శివాజీ గ‌ణేష‌న్ కూతురే ఈ రేఖ‌.

Rekha Viral with her Photos

ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించారు . ఒకానొక ద‌శ‌లో రేఖ ప్రేమ‌లో ప‌డి పోయాడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్. కానీ ఎందుక‌నో క‌లిసి ఉండ‌లేక పోయారు. అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో, ఇత‌ర ఈవెంట్స్ ల‌లో క‌లుసుకున్నా దూరంగా ఉంటూ వ‌చ్చారు.

ఇప్పుడు బిగ్ బి పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌కు పిల్ల‌లు ఉన్నారు. కానీ రేఖ(Rekha) నేటికీ ఒంట‌రిగానే ఉండి పోయింది. త‌న మ‌న‌సుకు న‌చ్చిన దొర‌క‌క పోవ‌డం, ప్రేమించ‌ని వాళ్ల నుంచి స‌రైన స్పంద‌న లేక పోవ‌డంతో ఏకాంతంలోనే ఉండేందుకే నిర్ణ‌యించుకుంది.

అయితే సెన్సాఫ్ ఆఫ్ హ్యూమ‌ర్ లో కానీ , డ్రెస్ సెన్స్ లో కానీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగి ఉండేలా చూసుకుంటూ వ‌స్తోంది రేఖ‌. ఇందుకు సంబంధించి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Janhvi Kapoor : ఓటీటీలో జాన్వీ కపూర్ మూవీ

Comments (0)
Add Comment