Hero Saif-Sara : సైఫ్ ఆరోగ్యంపై సారా అలీ ఖాన్ ఆరా

క‌త్తిపోట్ల‌కు గురై ఇంటికి చేరిన న‌టుడు

Saif : ముంబై – దుండ‌గుడి దాడిలో క‌త్తిపోట్ల‌కు గురై లీలావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ఇటీవ‌లే ఇంటికి చేరుకున్న బాలీవుడ్ న‌టుడు సైఫ్(Saif) అలీ ఖాన్ ను కూతురు, ప్ర‌ముఖ న‌టి సారా అలీఖాన్ ప‌రామ‌ర్శించింది. ఈ సంద‌ర్బంగా ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో త‌ను లేదు. వివ‌రాలు తెలుసుకుంది. అభిమానులు చేసిన ప్రార్థ‌న‌లు ఫ‌లించాయ‌ని, త‌న తండ్రికి ఏమీ కాలేద‌ని పేర్కొంది సారా అలీ ఖాన్.

Saif Ali Khan Health Update

కూతురుతో పాటు మ‌రికొంద‌రు కుటుంబీకులు ప‌రామ‌ర్శించారు సైఫ్ అలీ ఖాన్ ను. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని స్ప‌ష్టం చేశారు కూతురు. మ‌రో వైపు ఎనిమిది సినిమాల‌కు సంత‌కం చేశాడు సైఫ్. త‌ను తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో ఆ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్ లు నిలిచి పోయాయి. ఒక ర‌కంగా పెద్ద దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌ను ప్ర‌తి నాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవర మూవీలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించాడు సైఫ్ అలీ ఖాన్. ఈ చిత్రం బిగ్ హిట్ గా నిలిచింది. దీంతో దేవ‌ర -2 పేరుతో సీక్వెల్ తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇందులో కూడా విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు సైఫ్ అలీ ఖాన్. దాడి దెబ్బ‌కు షూటింగ్ కు ఇబ్బంది ఏర్ప‌డింది.

Also Read : Hero Bunny-Pushpa 2 OTT : త్వ‌ర‌లో నెట్ ఫ్లిక్స్ లో పుష్ప‌-2 స్ట్రీమింగ్

CommentsSaif Ali KhanSara Ali KhanUpdatesViral
Comments (0)
Add Comment