Aditi Rao Hydari Sensational :అదితి రావు వైర‌ల్ కామెంట్స్ హ‌ల్ చ‌ల్

మ‌న‌సు అదుపులో పెట్టుకుంటే ఆనంద‌మే

Aditi Rao Hydari : చేసింది కొన్ని సినిమాలే అయిన‌ప్ప‌టికీ స్టార్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది అదితి రావు హైద‌రీ. త‌ను ఎంచుకున్న పాత్ర‌ల‌లో లీన‌మై పోయి న‌టించ‌డంతో ఫుల్ జోష్ లో ఉంది. రోటీన్ క‌థ‌లు కాకుండా భిన్నంగా ఉండే వాటిని ఎంచుకుంటోంది. త‌నకంటూ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని త‌ల‌పిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో కానీ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన హీరో సిద్దార్థ్ లో కొంత కాలం డేటింగ్ చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌న‌ను పెళ్లి చేసుకుంది. ప్ర‌ముఖ ఆల‌యం రంగ‌నాయ‌క టెంపుల్ లో ఎవ‌రికీ తెలియ ప‌ర్చ‌కుండానే సింపుల్ గా త‌న‌తో జ‌త క‌ట్టింది.

Aditi Rao Hydari Sensational Comments

తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టించింది అదితి రావు హైదరి(Aditi Rao Hydari). సిద్దార్థ్ తో వివాహం జ‌రిగాక కూడా త‌న జ‌ర్నీని మాత్రం ఆప‌లేదు. కంటిన్యూగా కొన‌సాగిస్తూ వ‌స్తోంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి తాజాగా ఓ వెబ్ సీరీస్ లో కూడా త‌ళుక్కున మెరియ‌నుంది. తాను అంద‌రి హీరోయిన్ల లాగా కాకుండా వెరీ స్పెష‌ల్. కార‌ణం ఏమిటంటే త‌ను సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్ గా ఉంటుంది. ప్ర‌తి క్ష‌ణాన్ని, ఆలోచ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను పంచుకుంటుంది. ఫ్యాన్స్ తో ముచ్చ‌టిస్తుంది. దీంతో త‌న‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయిర్స్ ఉన్నారు.

ఇందులో భాగంగా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది. అదేమిటంటే ఆధ్యాత్మిక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే కామెంట్స్ చేసింది. నీళ్ల గురించి. అవి ఒక చోట ఉండ‌వు. కానీ అనుకున్న గ‌మ్యానికి ఎలాగోలా చేరుకుంటాయి. అలాగే మ‌నం కూడా మ‌న మ‌న‌సును నీళ్ల లాగా స్వ‌చ్చంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు జీవితం బోర్ కొట్ట‌కుండా హాయిగా ఉంటుంద‌ని చెప్పింది ఈ ముద్గుగుమ్మ‌. దీంతో అదితి రావు చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read : Hero Chiranjeevi Movie : కొత్త హంగుల‌తో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

Aditi Rao HydariCommentsSensationalViral
Comments (0)
Add Comment