Adivi Sesh: శ్రుతిహాసన్ తో అడవి శేష్‌ పాన్ ఇండియా సినిమా

శ్రుతిహాసన్ తో అడవి శేష్‌ పాన్ ఇండియా సినిమా

Adivi Sesh: ‘మేజర్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్‌. ప్రస్తుతం అడవి శేష్… 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన గుఢాచారి కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘జీ 2’ (గుఢాఛారి 2) సినిమాలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్టైన్ మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అడవి శేష్ కథను అందిస్తున్నారు. స్పై, యాక్షన్, థ్రిల్లర్ గా ఐదు దేశాల్లో షూటింగ్ చేసుకోబోయే ఈ సినిమాలో అడవి శేష్ సరసన బనితా సంధు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు అడవి శేష్(Adivi Sesh). ఈ సినిమాలో అడవి శేష్ సరసన శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో జీ2 తరువాత చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్ సినిమా కావడంతో అడవి శేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Adivi Sesh – దర్శకుడిగా మారుతున్న సినిమాటోగ్రాఫర్ షానీల్‌ డియో

అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో అడవి శేష్ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన షానీల్‌ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇదొక భిన్నమైన యాక్షన్‌ డ్రామా సినిమా. దీంట్లోని ప్రతి ఫ్రేమ్‌, డైలాగ్‌, సన్నివేశాన్ని హిందీతో పాటు తెలుగులో విడివిడిగా చిత్రీకరిస్తున్నాం. ప్రతి భాష.. సాంస్కృతిక ప్రత్యేకతను బట్టి దీన్ని విభిన్నంగా ట్రీట్‌ చేస్తున్నాం’’ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

Also Read : Alia Bhatt: స్కూల్ యూనిఫాంలో ఆడిషన్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

adivi seshshruthi hasan
Comments (0)
Add Comment