Aishwarya Rajinikanth: దర్శకుల సంఘానికి యేటా రూ.10 లక్షల విరాళం ప్రకటించిన ఐశ్వర్య రజనీకాంత్ !

దర్శకుల సంఘానికి యేటా రూ.10 లక్షల విరాళం ప్రకటించిన ఐశ్వర్య రజనీకాంత్ !

Aishwarya Rajinikanth: తమిళ చిత్ర దర్శకుల సంఘానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కుమార్తె, సినీ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ రూ. 10 లక్షల విరాళం అందజేశారు. ఇకపై ప్రతీ యేటా ఇంతే మొత్తాన్ని అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నిధులను సినీ దర్శకులు, సహాయ దర్శకుల పిల్లల విద్యాభ్యాసం కోసం ఖర్చు చేయాలని ఆమె సూచించారు.

Aishwarya Rajinikanth Announce…

దర్శకుల సంఘం సభ్యులు తమ పిల్లల చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి కొంతైనా ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో ఈ నిధులను అందిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈక్రమంలో శుక్రవారం రూ.10 లక్షల చెక్కును దర్శకుల సంఘ అధ్యక్షుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, ప్రధాన కార్యదర్శి పేరరసు, కోశాధికారి చరణ్‌కు ఆమె అందజేశారు.

ఆ సమయంలో ఫెఫ్సీ అధ్యక్షుడు, సినీ దర్శకుడు ఆర్‌కే సెల్వమణి ఉన్నారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు ఎళిల్‌, సి.రంగనాథన్‌, మిత్రన్‌ జవహర్‌, ఎస్‌ఆర్‌ ప్రభాకరన్‌, కార్యవర్గ సభ్యులు ఐశ్వర్యకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తొలి దశలో 2024లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న అసిస్టెంట్‌ దర్శకుల పిల్లలకు సహాయం చేయాలని దర్శకులు సంఘం నిర్ణయించింది.

Also Read : Raghu Thatha: ఓటీటీలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న కీర్తి సురేశ్‌ ‘రఘుతాత’ !

Aishwarya RajinikanthdanushSuper Star Rajanikanth
Comments (0)
Add Comment