Ajaz Khan : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది రియాల్టీ షో హౌస్ అరెస్ట్. దీనిని హోస్ట్ చేశారు అజాజ్ ఖాన్. తాజాగా ఈ షోపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఉల్లు యాప్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. తనను ఈ షో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో హౌస్ అరెస్ట్ కు చెందిన వీడియో క్లిప్ కలకలం రేపింది. సభ్య సమాజం తల దించుకునేలా ఈ షో ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది.
Ajaz Khan House Arrest Updates
ఈ వీడియో క్లిప్‌లోని ఖాన్(Ajaz Khan) కెమెరాలో సన్నిహిత, అనుచిత చర్యలను ప్రదర్శించమని మహిళా పోటీదారులపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. ఇది పూర్తిగా లైంగిక, అసభ్య కరమైన కంటెంట్ ఉండడం పట్ల మండిపడ్డారు ఫ్యాన్స్. ఉల్లు యాప్ ను స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుండి తొలగించారు. షో సందర్బంగా సంభాషణలో పాల్గొన్న కొంత మందికి అసభ్యకరమైన, వ్యక్తిగత ప్రశ్నలు ఉండటంతో అసౌకర్యంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హైస్ అరెస్ట్ రియాల్టీ షో వివాదాస్పదం కావడంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఉల్లు యాప్ సీఈవో విభు అగర్వాల్ , మాజీ బిగ్ బాస్ పోటీదారు అజాజ్ ఖాన్ లకు సమన్లు జారీ చేసింది. ఈ వివాదంపై స్వయంగా విచారణ చేపట్టింది. కంటెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Also Read : Hero Simbhu Comment : టైం పాటించక పోతే మణిరత్నంతో కష్టం