Hero Ajith Kumar : ద‌ళ‌ప‌తి నిర్ణ‌యం సాహ‌సోపేతం 

త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ 

Ajith Kumar : త‌మిళ సూప‌ర్ స్టార్ , ప‌ద్మ అవార్డు పుర‌స్కార గ్ర‌హీత న‌టుడు అజిత్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌త్యేకించి ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి. చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకున్నాడు. జీవితం చాలా విలువైంద‌ని, తాను ఎప్పుడు సినిమాల నుంచి వైదొలుగుతానో చెప్ప‌లేన‌ని పేర్కొన్నాడు అజిత్ కుమార్. ప్రేక్ష‌కులు ఆద‌రించినంత వ‌ర‌కే తాను సినిమాలు చేస్తాన‌ని ఆ త‌ర్వాత నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌ద‌న్నాడు.

Ajith Kumar Big Decision

అందుకే లైఫ్ లో చాలా వాటిని ప‌ట్టించు కోవ‌డం మానేశాన‌ని చెప్పాడు అజిత్ కుమార్(Ajith Kumar). బ‌ల‌వంతంగానైనా తాను నిష్క్రమించే ఛాన్స్ ఉంద‌న్నాడు. దేవుడు ఇచ్చిన వ‌రం అని తాను భావిస్తాన‌ని అన్నాడు. ఎందుకంటే వేలాది మంది మ‌న‌సు దోచుకోవ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు. తాను ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యానికి లోన‌వుతాన‌ని అన్నాడు. కార‌ణం ఏమిటంటే నేను సినిమా రంగానికి వ‌చ్చి 33 ఏళ్లు పూర్తి కావ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నాడు. ఎన్నో స‌వాళ్లు, ఇబ్బందులు, స‌క్సెస్ లు , వైఫ‌ల్యాలు సంభ‌వించాయ‌ని వాటిని స‌మానంగా చూడ‌టం అల‌వాటుగా చేసుకున్నాన‌ని చెప్పాడు స్టార్ హీరో.

ఇదే స‌మ‌యంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ప‌ట్ల స్పందించాడు అజిత్ కుమార్. ఇది సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించాడు. పాలిటిక్స్ లోకి వ‌చ్చే వారికి అభినంద‌లు తెలిపాడు. కానీ త‌న‌కు మాత్రం రాజ‌కీయాల్లోకి రావాల‌ని లేద‌న్నాడు. 140 కోట్ల మందికి పైగా జ‌నాభాను కంట్రోల్ చేయ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు. ఇది రాజ‌కీయ నాయ‌కుల‌కే చెల్లుబాటు అవుతుంద‌న్నాడు. త‌న‌కు చేత కాద‌ని, ఈ స‌మ‌యంలో కొంత విశ్రాంతి తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు.

Also Read : Hit 3 Success : ఇంత‌గా ఆద‌రిస్తార‌ని అనుకోలేదు
Ajith KumarCommentsUpdatesViral
Comments (0)
Add Comment