Hero Ajith Kumar Car Race :కారు రేసింగ్ లో స‌త్తా చాటిన అజిత్ టీమ్

గుడ్ బ్యాడ్ అగ్లీ థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్

Ajith Kumar : గాయ‌ప‌డినా స‌రే త‌ను ముందుకే వెళుతున్నాడు త‌మిళ సినీ రంగానికి చెందిన న‌టుడు అజిత్ కుమార్. త‌న‌కు కారు రేసింగ్ అంటే చ‌చ్చేంత ఇష్టం..అంత‌కు మించి ప్రాణం కూడా. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కారు రేసింగ్ పోటీల్లో అనుకోకుండా గాయ‌ప‌డ్డాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. అయినా త‌న ధోర‌ణి మార్చుకోలేదు. తాజాగా బెల్జియం కారు రేసింగ్ లో పాల్గొన్నాడు. ఇక్క‌డ కూడా ప్ర‌మాదానికి లోన‌య్యాడు. బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. దీంతో త‌న కుటుంబంతో స‌హా ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. త‌ను పూర్తిగా కోలుకోవాలంటూ కోరుకున్నారు.

Ajith Kumar Team in Car Racing

వారి ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. తిరిగి తాను కుదురుకున్నాడు. ఆపై కారు రేసింగ్ లో త‌న టీమ్ తో క‌లిసి పాల్గొన్నాడు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ టీం. రేసింగ్ పోటీల‌లో రెండ‌వ స్థానంలో నిలిచింది. దీంతో ఆనందానికి లోన‌య్యాడు అజిత్ కుమార్(Ajith Kumar). ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది త‌ను న‌టించిన రెండు మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. విదాముయార్చి రిలీజ్ కాగా మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇదే స‌మ‌యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుద‌లైంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది.

నటుడి కార్ రేసింగ్ టీమ్ బెల్జియంలోని ప్రతిష్టాత్మక స్పా ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో రెండవ స్థానంలో నిలవ‌డం ప‌ట్ల టీమ్ తో పాటు అభిమానులు, భార్య షాలిని సంతృప్తిని వ్య‌క్తం చేసింది. అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ఈవెంట్ నుండి గెలుపొందిన చిత్రాన్ని పంచుకుంది టీం. భార‌త మోటార్ స్పోర్ట్స్ కు ఇది గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణంగా పేర్కొంది. అద్భుత‌మైన పీ2 పోడియం ముగింపును సాధించింద‌ని పేర్కొంది. ప్ర‌పంచ రేసింగ్ వేదిక‌పై అభిరుచి, కచ్చిత‌త్వం, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలిచింద‌ని తెలిపింది.

Also Read : Hero Sharwanand :ఓ మేఘ‌మాల నాపై క‌రుణించ‌వేల‌

Comments (0)
Add Comment