Hero Naga Chaitanya :జోరు మీదున్న అక్కినేని నాగ చైత‌న్య‌

25వ చిత్రానికి ఓకే చెప్పిన న‌టుడు

Naga Chaitanya : నేష‌న‌ల్ బ్యూటీ స‌మంత రుత్ ప్ర‌భుతో విడి పోయాక‌, శోభిత ధూళిపాళ‌తో జ‌త క‌ట్టాక అక్కినేని నాగ చైత‌న్య(Naga Chaitanya) జోరు మ‌రింత‌గా పెరిగింది. త‌ను సాయి ప‌ల్ల‌వితో క‌లిసి చేసిన చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన థండేల్ చిత్రం బిగ్ స‌క్సెస్ సాధించింది. అంచ‌నాలకు మించి ఆద‌ర‌ణ చూర‌గొంది. ప్ర‌ధానంగా డిఫ‌రెంట్ జాన‌ర్ లో త‌న‌ను ప్ర‌జెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు ఈ మూవీలో. పూర్తిగా గ్రామీణ నేప‌థ్యం , దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

Naga Chaitanya Movie Updates

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌లైన థండేల్ రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో స‌మంత‌తో విడి పోయాక పూర్తిగా దూరంగా ఉన్న నాగ చైత‌న్య‌కు ఉన్న‌ట్టుండి మంచి బూస్ట్ ఇచ్చింది థండేల్ మూవీ. ఆ వెంట‌నే విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. ఇది త‌న సినీ కెరీర్ లో 24వ చిత్రం కావ‌డం విశేషం.

ఇదే స‌మ‌యంలో అక్కినేని నాగ చైత‌న్య‌కు సంబఃధించి టాలీవుడ్ లో మ‌రో మూవీకి ఓకే చెప్పిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పాత ద‌ర్శ‌కుల‌తో కాకుండా కొత్త ద‌ర్శ‌కుడు కిషోర్ క‌థ చెప్పాడ‌ని, దీంతో న‌చ్చ‌డంతో ప్ర‌స్తుతం షూటింగ్ అయి పోయాక సిద్దం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.

Also Read : Kalyan Shankar Shocking :వినోదం జీవితంలో భాగం సినిమాకు ప్రాణం

MoviesNaga ChaitanyaUpdatesViral
Comments (0)
Add Comment