టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున బిజీగా ఉన్నారు. తను నటించిన చిత్రం కుబేర రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక ప్రచార కార్యక్రమాలపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఫోకస్ పెట్టాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి మూవీని ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉండేలా చూస్తాడు. టేకింగ్, మేకింగ్ లో తనకు తనే సాటి. గతంలో తను తీసిన కాలేజ్ డేస్, గోదావరి, ఫిదా, డాలర్ డ్రీమ్స్ మంచి ఆదరణ పొందాయి. సంగీతానికి, నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూస్తాడు. దీంతో తన వద్ద పని చేసేందుకు చాలా మంది ఇష్ట పడతారు.
ఇప్పటికే గోదావరిలో సుమంత్ , కమలిని ముఖర్జీతో కలిసి తీశాడు. అది సంగీత పరంగా హిట్ గా నిలిచింది. తాజాగా కుబేర తీశాడు. ఇందులో కీ రోల్స్ పోషిస్తున్నారు నాగార్జున, తమిళ సినీ హీరో ధనుష్. డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ సందర్బంగా చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నాగ్. శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు తాను 15 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పాడు. తొలుత 20 నిమిషాల పాటు కథ చెప్పాడని, ఆ తర్వాత విన్న వెంటనే ఓకే చెప్పానని తెలిపాడు.
ఇప్పటికే కుబేరకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై బజ్ కూడా పెరిగింది. మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఏర్పడింది. నాగార్జున, ధనుష్ కీలక నటులు కావడంతో పెట్టిన ఖర్చు పూర్తిగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు శేఖర్ కమ్ముల. విచిత్రం ఏమిటంటే ధనుష్ కుబేరలో భిక్షగాడి పాత్రను వేశాడు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ పోషిస్తుండడం.