Alia Bhatt: స్కూల్ యూనిఫాంలో ఆడిషన్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

స్కూల్ యూనిఫాంలో ఆడిషన్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

Alia Bhatt: కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘స్టూ డెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు ఆలియా భట్. తొలి సినిమా నుండే విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆలియా… తాజాగా నిర్మాతగా కూడా మెప్పిస్తోంది. అయితే ఇటీవల జడ్డాలో నిర్వహించిన డ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో పాల్గొన్న అలియా… తన మొదటి సినిమా ఆడిషన్‌ ఎలా జరిగింది అనే విషయాలను వెల్లడించింది. దీనితో తన మొదటి ఆడిషన్స్ పై ఆలియా(Alia Bhatt) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Alia Bhatt – స్కూల్ యూనిఫాంలో కరణ్ తో మీటింగ్

‘నేను 11వ తరగతి చదువుతున్న సమయంలో ఒక రోజు నాకు దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌తో మీటింగ్‌ ఉన్నట్లు ఫోన్‌ వచ్చింది. దీనితో నేను స్కూల్‌ నుండి నేరుగా కరణ్ ఆఫీసుకు వెళ్ళాను. నా 11వ తరగతిలో నేను ఎక్కువ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటూ చాలా బొద్దుగా ఉండేదాన్ని. దీనితో నన్ను చూసిన వెంటనే ఆడిషన్‌ ఇవ్వమని అడిగారు. ఆడిషన్‌ అంటే ఏమిటో తెలియకుండానే లోపలికి వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. అయితే నేను ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యానని కరణ్‌ చెప్పగానే… ఆ క్షణం నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే ఆనందంతో ఒక కప్‌ కేక్‌ తినొచ్చా అని కరణ్‌ అడిగాను అని ఆమె తన మొదటి ఆడిషన్స్ ఫాల్గొన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాల్లో నటించడానికి అవకాశం వచ్చిందనే విషయం తెలియగానే మా అమ్మ కొంచెం సంకోచించినా మా నాన్న మాత్రం వెంటనే అంగీకరించారు’ అంటూ గుర్తుచేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె ఆలియా భట్. బాలనటిగా 1999 సంఘర్ష్ అనే సినిమాలో నటించిన ఆలియా… 2012లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తో బాలీవుడ్ హీరోయిన్ గా మారింది. 2స్టేట్స్, హైవే, ఉడ్తా పంజాబ్, గుల్లీబాయ్, గంగూభాయ్ కతివాడియా, బ్రహ్మాస్త్ర సినిమాలతో అగ్ర తారగా ఎదిగిన ఆలియా… రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని రాహా అనే అమ్మాయికి జన్మనిచ్చింది. తాజాగా నిర్మాతగా మారిన ఆలియా… ప్రస్తుతం ‘జిగ్రా’ షూటింగ్ లో బిజీగా ఉంది.

Also Read : Payal Rajput: రిషబ్ శెట్టి వెంటపడుతున్న పాయల్ రాజపుత్

Alia Bhattranbir kapoor
Comments (0)
Add Comment