Allu Arjun : రూ. 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంటోంది స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee), ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో. దీనిని హాలీవుడ్ రేంజ్ లో తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఇప్పటికే సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తను షారక్ ఖాన్ , విజయ్ సేతుపతితో తీసిన జవాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వస్తున్న ప్రాజెక్టు కావడంతో మరింత అంచనాలు పెంచేలా చేశాయి. ఇది పక్కన పెడితే భారతీయ సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్ తో మూవీ తీయడం ఇదే తొలిసారి అని అంటున్నారు సినీ వర్గాలు.
Allu Arjun-Atlee Kumar Pan World Movie Updates
ఇది పక్కన పెడితే బన్నీ, అట్లీ ఇప్పటికే అమెరికాకు వెళ్లి వచ్చారు. తాజాగా పాన్ వరల్డ్ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే లుక్ టెస్ట్ ముంబైలో నిర్వహించనున్నారు. సినిమా ప్రకటించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారాడు దర్శకుడు అట్లీ కుమార్. దీనిని సన్ పిక్చర్స్ అధినేత, ఎంపీ దయానిధి మారన్ నిర్మిస్తుండడం విశేషం. ఇదే నిర్మాణ సారథ్యంలో రజనీకాంత్ కూలీ రానుంది. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తలైవాతో ఇంతకు ముందు తీసిన జైలర్ ఆశించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా చేసింది. దీంతో కూలీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ కు ఓకే చెప్పాడు. విచిత్రం ఏమిటంటే గతంలో సినీ ఇండస్ట్రీలో ఏ నిర్మాణ సంస్థ ఇవ్వని ఆఫర్ ను అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ కుమార్ కు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరికి రూ. 350 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులను తిరగ రాస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Also Read : నేచురల్ స్టార్ తో నటించాలని ఉంది