Hero Allu Arjun-Atlee :అట్లీ మూవీలో బ‌న్నీ డ్యూయ‌ల్ రోల్ ..?

న్యూ లుక్ లో అల్లు అర్జున్ హ‌ల్ చ‌ల్

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సూప‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ క్రేజీ కాంబినేష‌న్ లో త్వ‌ర‌లో కొత్త మూవీ రానుంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న చిత్రం అనౌన్స్ చేశారు స‌న్ పిక్చ‌ర్స్ అధినేత, డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్. విచిత్రం ఏమిటంటే భార‌తీయ మూవీ ఇండ‌స్ట్రీలో ఏకంగా హీరో, ద‌ర్శ‌కుడికి రూ. 300 కోట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా రూ. 800 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నార‌ని టాక్. దీనిని హాలీవుడ్ రేంజ్ లో తీయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు డైరెక్ట‌ర్ అట్లీ కుమార్.

Allu Arjun Dual Role in Atlee Movie

ఇక అల్లు అర్జున్(Allu Arjun) బ‌ర్త్ డే సంద‌ర్బంగా సినిమా తీస్తున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ప్రాజెక్టు వివ‌రాల‌తో కూడిన వీడియోను షేర్ చేసింది. ఈ రెండూ సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. త‌ను తాజాగా త‌న భార్య స్నేహా రెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ క‌జిన్ వివాహానికి హాజ‌ర‌య్యారు. కాగా ఈ కొత్త మూవీలో బ‌న్నీ డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న‌ట్లు టాక్.

ఈ సంద‌ర్బంగా బ‌న్నీ హెయిర్ స్ట‌యిల్ డిఫ‌రెంట్ గా ఉంది. ఇది ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ స్టైల్ బ‌న్నీ, అట్లీ కొత్త మూవీ కోసం త‌యారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది జోరుగా. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. కొత్త మూవీకి తాత్కాలిక టైటిల్ ను ఖ‌రారు చేశాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్. AA 22 x A6 పేరును రివీల్ చేశాడు. ఇక బ‌న్నీ కెరీర్ లో ఈ చిత్రం 22వ‌ది కావ‌డం విశేషం. ఆధునిక టెక్నాల‌జీని ఈ సినిమా కోసం వినియోగించు కుంటామ‌ని ప్ర‌క‌టించాడు. ఇది అభిమానుల ఊహ‌కు అంద‌ని రీతిలో ఉంటుంద‌న్నాడు.

Also Read : Sarangapani Jathakam Sensational : న‌వ్వుల లోకం సారంగ‌పాణి జాత‌కం

allu arjunatleeCinemaUpdatesViral
Comments (0)
Add Comment