Allu Arjun: ‘ఆర్య’ సినిమాపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ !

‘ఆర్య’ సినిమాపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ !

Allu Arjun: అల్లు అర్జున్‌ కెరీర్‌ ను మలుపు తిప్పడమే కాకుండా మరెందరికో లైఫ్ ఇచ్చిన సినిమా ‘ఆర్య’. సుకుమార్‌ దర్శకత్వంతో వచ్చిన ఈ లవ్ స్టోరీకు… దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి యూత్‌ అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తవ్వడంతో సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, విశేషాలు సందడి చేస్తున్నాయి. ‘ఆర్య’ రోజులను గుర్తుచేసుకుంటూ బన్నీ కూడా పోస్ట్‌ పెట్టారు. ‘‘ఆర్య’కు 20 ఏళ్లు. ఇది సినిమా రిలీజ్ డేట్‌ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని రాసుకొచ్చారు. స్వీట్‌ మెమొరీస్‌ అంటూ ఆ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. గతంలో ఓ సందర్భంలో సుకుమార్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ… ‘అల్లు అర్జున్‌ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని, తన కెరీర్‌ను మార్చేసింది’ అని చెప్పారు.

Allu Arjun Post Viral

‘ఆర్య’ సినిమా 20 ఏళ్ల సెలబ్రేషన్స్‌ కోసం సినిమా యూనిట్ రీ యూనియన్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఆ పార్టీకి అల్లు అర్జున్‌(Allu Arjun) తో పాటు సుకుమార్‌, దిల్‌ రాజు కూడా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. వీళ్ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో దాని సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన తొలిపాట రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

Also Read : Swayambhu Movie : రోజు రోజుకు అంచనాలు తారుమారు చేస్తున్న నిఖిల్ ‘స్వయంభు’

allu arjunaryasukumar
Comments (0)
Add Comment