Hero Allu Arjun-Atlee :అల్లు అర్జున్ అట్లీ మూవీలో అమీర్ ఖాన్..?

హాలీవుడ్ స్థాయిలో సినిమా తీస్తున్న స‌న్ మూవీస్

Allu Arjun : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కోలీవుడ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కాంబోలో త్వ‌ర‌లో సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే మూవీకి సంబంధించి టైటిల్ ను కూడా ఖ‌రారు చేశారు. దీనిని త‌మిళ ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ మూవీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అధినేత , డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ఖ‌ర్చుతో దీనిని తీసేందుకు రెడీ అయ్యాడు ద‌ర్శ‌కుడు.

Allu Arjun-Atlee Kumar

ఈ సంద‌ర్బంగా ఇందులో హీరోయిన్ల ఎంపికపై ఫోక‌స్ పెట్టాడు అట్లీ కుమార్. దీపికా ప‌దుకొనే, న‌య‌న తార‌, ర‌ష్మిక మంద‌న్న‌ను ట‌చ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇంకా వీరి ఎంపిక‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నివాసంలో స్వ‌యంగా క‌ల‌వ‌డం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మూవీలో న‌టింప చేసేందుకే త‌ను క‌లిసిన‌ట్టు సినీ వ‌ర్గాల ద్వారా టాక్. ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మ‌ర్యాద పూర్వ‌కంగా అమీర్ ఖాన్ ను అల్లు అర్జున్(Allu Arjun) క‌లిశాడా లేక త‌ను త్వ‌ర‌లో న‌టించ బోయే కొత్త మూవీలో కీ రోల్ పోషించాల‌ని కోరేందుకు వెళ్లాడా అన్న‌ది ఇంకా తెలియ రాలేదు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక మ‌రింత ఉత్కంఠ‌ను రేపేలా చేసింది. ఇద్ద‌రూ ఇప్పుడు టాప్ హీరోలుగా గుర్తింపు పొందారు. అమీర్ ఖాన్ బ‌న్నీ తో క‌లిసి న‌వ్వుతూ క‌నిపించాడు. వీరి స‌మావేశం వెనుక ఉన్న వివ‌రాలు ఇంకా తెలియ రాలేదు. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్. వేవ్స్ స‌మ్మిట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ కీల‌క కామెంట్స్ చేశాడు.

Also Read : Hero Varun Tej-Lavanya :లావ‌ణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ వ‌రుణ్‌ తేజ్ క‌న్ ఫ‌ర్మ్

allu arjunatleeCinemaUpdatesViral
Comments (0)
Add Comment