Hero Allu Arjun-Chiranjeevi :మెగాస్టార్ ప్ర‌భావం స‌క్సెస్ కు సోపానం

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun : ప‌లు వివాదాల‌లో ఇరుక్కుని చివ‌ర‌కు జైలు పాలై బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌టుడు, పాన్ ఇండియ‌న్ స్టార్ అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబై వేదిక‌గా జ‌రిగిన వేవ్స్ స‌మ్మిట్ లో త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. తాను ఈ స్థాయికి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఆయ‌న చేసిన డ్యాన్సులు చూసి పెరిగాన‌ని చెప్పాడు. ఏదైనా క‌ష్ట ప‌డితేనే వ‌స్తుంద‌ని, అందుకే తాను ఎక్కువ‌గా వంద శాతం ప‌ర్ ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నాడు.

Allu Arjun Comment about Chiranjeevi

తాను ఈ స్థాయికి వ‌చ్చేందుకు దోహ‌ద ప‌డింది చిరంజీవి అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. దీంతో అక్క‌డున్న వారంతా విస్తు పోయారు. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచారంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ్య‌తిరేకంగా. దీంతో కొంత గ్యాప్ ఏర్ప‌డింది. గ్యాప్ ను స‌రి చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు టాక్. ఇది ప‌క్క‌న పెడితే ఇటీవ‌లే ప‌వ‌న్ కొడుకు సింగ‌పూర్ బడిలో చ‌దువుకుంటూ అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్

తాను న‌టుడిగా మారేందుకు ముమ్మాటికీ మెగాస్టారేనంటూ చెప్పాడు అల్లు అర్జున్(Allu Arjun). అయితే డ్యాన్స్ ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను ఎవ‌రి ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకోలేద‌న్నారు. స్వంతంగానే తాను నేర్చుకున్నాన‌ని, ఎవ‌రిపై ఆధార‌ప‌డ లేద‌న్నాడు బ‌న్నీ. ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాన‌ని, ఆ త‌ర్వాత బ‌య‌ట ప‌డ్డాడ‌న‌ని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాన‌ని చెప్పాడు. 18వ మూవీ ప్లాప్ అయ్యింద‌ని, అల వైకుంఠపురం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింద‌న్నాడు. ఆ త‌ర్వాత పుష్ప సృష్టించిన చ‌రిత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదన్నాడు. త్వ‌ర‌లో అట్లీతో మాలీవుడ్ రేంజ్ లో రాబోతోంద‌న్నాడు బ‌న్నీ.

Also Read : Hero Chiranjeevi : నాపై ఆ ముగ్గురి ప్ర‌భావం ఉంది

allu arjunCommentsMega Star ChiranjeeviViral
Comments (0)
Add Comment