Hero Allu Arjun-Atlee :హాలీవుడ్ రేంజ్ లో బ‌న్నీ..అట్లీ మూవీ

వేవ్స్ స‌మ్మిట్ లో షాకింగ్ కామెంట్స్

Allu Arjun : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా సినిమా మొద‌లు పెట్ట‌నేలేదు రికార్డుల మోత మోగిస్తోంది. సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది. కంటెంట్ అద్భుతంగా ఉంటే చాలు మూవీ సూప‌ర్ హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నారు. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ నిర్మాణ సంస్థ అధినేత , ఎంపీ క‌ళానిధి మార‌న్ ఏకంగా రూ. 800 కోట్లకు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Allu Arjun – Atlee Kumar Movie

ఇదే స‌మ‌యంలో సినిమా ప్రారంభం గురించి కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు అట్లీ, మార‌న్, అల్లు అర్జున్. అమెరికాలోని హాలీవుడ్ స్టూడియోలో టెస్టింగ్ చేసిన స‌న్నివేశాల‌తో కూడిన వీడియోను షేర్ చేశారు. ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇదే స‌మ‌యంలో బ‌న్నీ, అట్లీకి సంబంధించి ద‌యానిధి మార‌న్ రూ. 300 కోట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడు ఇండియాలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.

త‌ను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పుష్ప 2 సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. దేశంలోనే రెండవ అతి పెద్ద మూవీ కలెక్ష‌న్ల ప‌రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. బ‌న్నీ, అట్లీ క‌లిసి చేస్తున్న కొత్త ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా షూటింగ్ మొద‌లే కాలేదు రికార్డు బ్రేక్ చేస్తోంది. భారీ ఎత్తున మార్కెట్ డిమాండ్ ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. ఏకంగా రూ. 5,000 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు సినీ వ‌ర్గాలు.

Also Read : Popular Dir Lokesh Kanagaraj :సూర్య‌తో రోలెక్స్ మూవీ త‌ప్ప‌కుండా చేస్తా

allu arjunatleeUpdatesViral
Comments (0)
Add Comment