Hero Allu Arjun-Trivikram :బ‌న్నీతో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మూవీ క‌న్ ఫ‌ర్మ్

పూర్తి పౌరాణిక చిత్రం తీస్తామ‌ని ప్ర‌క‌ట‌న

Allu Arjun : బ‌న్నీ అభిమానుల‌కు గుడ్ న్యూస్ . గ‌త కొంత కాలంగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో సినిమా ఉంటుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారానికి త‌ర ప‌డింది. పూర్తిగా పౌరాణిక నేప‌థ్యం క‌లిగిన చిత్రం రాబోతోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram Srinivas). క‌థ‌ను బ‌లంగా చెప్ప‌డంతో పాటు హృద‌యానికి హ‌త్తుకునేలా డైలాగులు రాయ‌డంలో త‌న‌కు త‌నే సాటి. తాజాగా అల్లు అర్జున్ తో గ‌త కొంత కాలంగా క‌థ చెబుతూ వ‌చ్చాడ‌ని, విన్న వెంట‌నే సినిమా చేద్దామంటూ ప‌చ్చ జెండా ఊపాడ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు ప్ర‌ముఖ నిర్మాత‌, సితార ఎంట‌ర్ టైన‌ర్ బ్యాన‌ర్ అధినేత నాగ‌వంశీ.

Allu Arjun – Trivikram Srinivas Movie Updates

త‌ను ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. ఎందుకంటే త‌ను నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ గా నిలిచింది. భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఏకంగా విడుద‌లైన తొలి రోజు రూ. 21 కోట్లు మూడో రోజుకు రూ. 35 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ లోనూ కూడా దూసుకు పోతోంది క‌లెక్ష‌న్స్ ప‌రంగా . ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి చిట్ చాట్ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు నాగ వంశీ. త‌మ నిర్మాణ సార‌థ్యంలో అల్లు అర్జున్ , త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో పూర్తిగా పౌరాణిక నేప‌థ్యం క‌లిగిన సినిమాను తీయ బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో బ‌న్నీతో మూవీ క‌న్ ఫ‌ర్మ్ చేశాడ‌న్న‌మాట‌.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్ద‌రు క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమాలు తీశాడు. ఈ రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ఒక‌టి జులాయి కాగా రెండోది అల వైకుంఠ‌పురంలో. జులాయిలో ఇలియానా న‌టిస్తే..అల వైకుంఠ‌పురంలో పూజా హెగ్డే న‌టించింది. మొత్తంగా ఈ ఇద్ద‌రి నుంచి మూడో కాంబినేష‌న్ ఎలా ఉంటుందోన‌ని తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు.

Also Read : Beauty Samyuktha Praises :బాల‌య్య చెడ్డోడు కాదు మ‌న‌సున్నోడు

allu arjunCinemaTrendingTrivikram SrinivasUpdates
Comments (0)
Add Comment