Allu Ayaan: అల్లు అయాన్‌ పాటకు షారుక్‌ ఫిదా !

అల్లు అయాన్‌ పాటకు షారుక్‌ ఫిదా !

Allu Ayaan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తనయుడు అయాన్‌ సింగర్ అవతారం ఎత్తారు. అల్లు అర్జున్… తన కొడుకు అల్లు అయాన్, కుమార్తె అర్హతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా… ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ ఫుట్ గయా అనే పాటను పాడాడు అయాన్. అయాన్ ఆ పాట పాడుతున్న దృశ్యాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి… దానిని సోషల్ మీడియాలో షేర్ చేసారు అల్లు అర్జున్. అయాన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… ఆ వీడియోను ‘షారుక్‌ ఖాన్‌ యూనివర్స్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలోనూ అది పోస్ట్‌ అయింది. దీనిని చూసిన షారుక్‌ ఖాన్‌… అయాన్ ను మెచ్చుకున్నారు.

Allu Ayaan Song Viral

తాను నటించిన ‘డంకీ’ సినిమాలోని ‘లుట్‌ పుట్‌ గయా’ పాటను పాడినందుకు అయాన్ కు థ్యాంక్స్‌ చెప్పారు కింగ్ ఖాన్ షారూక్. అంతేకాదు… ‘నువ్వు ఫ్లవర్‌ అండ్‌ ఫైర్‌. ఇప్పుడు ‘శ్రీవల్లి’ (అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన పుష్ప సినిమాలోని పాట) పాటను మా పిల్లలతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నా’ అంటూ కామెంట్ పెట్టారు. షారుక్‌ పోస్ట్‌ పై అల్లు అర్జున్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనపై ప్రేమ కురిపిస్తూ లవ్‌ సింబల్‌ ఎమోజీ జోడించారు. ఓ అగ్ర హీరోకి మరో అగ్ర హీరో రిప్లై ఇవ్వడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఫొటోలను ఓకే ఫ్రేమ్‌లో సెట్‌ చేసి, ‘ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Trisha Krishnan : నాకు అండగా నిలిచిన నా అన్నలకు ధన్యవాదాలు అంటున్న త్రిష

allu arjunAllu AyaanSharukh Khan
Comments (0)
Add Comment