Ameesha Patel : ఖాన్ న‌ట‌న‌కు అమీషా ఫిదా

జ‌వాన్ చిత్రం అద్భుతం

Ameesha Patel : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను స‌న్నీ డియోల్ తో క‌లిసి అనిల్ శ‌ర్మ తీసిన గ‌ద‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి దూసుకు పోతోంది. ఈ త‌రుణంలో ఫుల్ ఖుషీగా ఉంది స‌ద‌రు మూవీ టీమ్ .

ఈ త‌రుణంలో విడుద‌లైన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ గురించి స్పందించింది అమీషా ప‌టేల్(Ameesha Patel). తాను జ‌వాన్ ను చూశాన‌ని, షారుక్ ఖాన్ న‌ట‌నను చూసి తాను విస్తు పోయాన‌ని చెప్పింది. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో బాద్ షా న‌టించి మెప్పించాడ‌ని కితాబు ఇచ్చింది అమీషా పటేల్.

Ameesha Patel Praises Shah Rukh Khan Acting

జ‌వాన్ చిత్రంలో వంద మార్కులు ఇవ్వాల్సింది బాద్ షాకు. మిగ‌తా న‌టీ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న అద్బుతంగా ఉంద‌ని పేర్కొన్నారు న‌టి. తాను ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాన‌ని తెలిపారు. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా జ‌వాన్ నిలిచింద‌ని ఇందుకు త‌నకు సంతోషం క‌లిగిస్తోంద‌ని స్ప‌ష్టం చేసింది.

త‌న సినిమాతో పాటు షారుక్ ఖాన్ చిత్రాన్ని కూడా భారీగా ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు అమీషా ప‌టేల్. ఇదిలా ఉండ‌గా గ‌త వారం షారుక్ ఖాన్ ముంబైలో నిర్వ‌హించిన గ‌ద‌ర్ -2 స‌క్సెస్ పార్టీలో హాజ‌ర‌య్యాడు. త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపాడు. గ‌ద‌ర్ -2 చూశాన‌ని చాలా బాగుంద‌ని కితాబు ఇచ్చాడు. తాజాగా అమీషా ప‌టేల్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Jawan Movie : జ‌వాన్ వ‌సూళ్ల జైత్ర‌యాత్ర‌

Comments (0)
Add Comment