Amitabh Bachchan: ‘కల్కి 2898 ఏడీ’ లో అశ్వత్థామగా అమితాబ్‌ ఫస్ట్ లుక్ అదుర్స్ !

‘కల్కి 2898 ఏడీ’ లో అశ్వత్థామగా అమితాబ్‌ ఫస్ట్ లుక్ అదుర్స్ !

Amitabh Bachchan: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అశ్వత్థామగా అమితాబ్ ఫస్ట్ లుక్ వీడియోను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Amitabh Bachchan in Kalki

ఇక అమితాబ్ ఫస్ట్ లుక్ వీడియో విషయానికి వస్తే… ‘‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను. ద్రోణాచార్య తనయుడిని’’ అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan). ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి ప్రశ్నించగా, తన పాత్రని పరిచయం చేస్తూ కనిపిస్తారు అమితాబ్‌ బచ్చన్‌. గుబురు గడ్డం.. పాత దుస్తులు.. మొహం కనిపించకుండా కళ్లు మాత్రమే కనిపిస్తున్న అమితాబ్‌ లుక్‌ బాగుంది. పురాణాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ సినిమా… మరెవ్వరికీ లేని అనుభవాన్ని తనకు పంచిందంటూ అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు. కాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీలో ప్రభాస్‌ నటిస్తున్న భైరవ పాత్రని పరిచయం చేస్తూ టీమ్‌ విడుదల చేసిన స్పెషల్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా అమితాబ్‌ అశ్వథ్థామ వీడియోకి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

Also Read : Mega Star Chiranjeevi: యోదా డయాగ్నోస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి !

Amitabh BachchanKalki 2898 ADPrabhas
Comments (0)
Add Comment