Amy Jackson: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రామ్ చరణ్ బ్యూటీ !

రెండో పెళ్లికి రెడీ అవుతున్న రామ్ చరణ్ బ్యూటీ !

Amy Jackson: మదరాసపట్టినమ్ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టి… ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ఎవడు’ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్ అమీ జాక్సన్. ఆ తరువాత విక్రమ్ తో ఐ, రజనీకాంత్ తో రోబో 2.0 సినిమాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి భారతీయ నటిగా సెటిలయింది. జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్… అతడితో ఓ కొడుక్కి కూడా జన్మనిచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమో గానీ జార్జ్ తో మనస్పర్ధలు రావడంతో… అతడి నుంచి విడిపోయింది.

Amy Jackson Marriage Updates

మరల కొన్నాళ్ళకు మరో బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్‌ విక్‌ తో ప్రేమలో పడింది. చాలా కాలంగా వీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ… పార్టీల్లో పబ్బుల్లో కనిపించడం తప్ప… అధికారికంగా తమ బంధం గురించి ఎక్కడా బయటపెట్టలేదు. అయితే ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్ళిన అమీ జాక్సన్(Amy Jackson) కు… తన బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌ విక్‌ సర్ప్రైజింగ్ గా లవ్ ప్రపోజ్ చేసాడట. మంచు పర్వతాల్లో తన లవ్ ను ప్రపోజ్ చేయడంతో… సర్ప్రైజ్ ప్రపోజ్ కు అమీ కూడా ఫిదా అయిపోయి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… అతి త్వరలోనే అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధపడిందని సమాచారం.

భారతీయ మోడల్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టిన భారతీయ మోడల్ అమీ జాక్సన్… ఆ తరువాత తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. అభినేత్రి అనే ద్విభాషా సినిమాతో పాటు పలు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కన్నడలో ది విలన్, ఇంగ్లీషులో బూగీమ్యాన్ సినిమాల్లో నటిస్తున్న అమీ… త్వరలో రెండో పెళ్ళికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Gopichand Bhimaa : ‘బీమా’ సినిమాతో మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా రానున్న గోపీచంద్

Amy Jackson
Comments (0)
Add Comment