తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. కానీ వయసుకు మించిన పాత్రలను పోషించి అందరిని మెప్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ తను ఎవరో కాదు అనంతిక సనీల్ కుమార్. తను నటించిన చిత్రం 8 వసంతాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకునేలా తీశాడు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. తన శక్తివంతమైన నటనను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మరింత బజ్ ను పెంచేలా చేశాయి.
ఈ ఏడాది పెద్ద చిత్రాలతో పాటు చిన్న మూవీస్ విడుదలయ్యాయి. ఎవరూ ఊహించని రీతిలో ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అందులో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన థండేల్ , ప్రియదర్శి నటించిన కోర్టు, విష్ణు, కేతికా శర్మ నటించిన సింగిల్ , నాగవంశీ నిర్మించిన మ్యాడ్ సీక్వెల్ దుమ్ము రేపాయి. కాగా అనంతిక సనీల్ కుమార్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మ్యాడ్ లో కీ రోల్ పోషించింది. ఇది సూపర్ హిట్ కావడంతో తనకు 8 వసంతాలు చిత్రంలో ఛాన్స్ దక్కేలా చేసింది.
మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. ఈ సందర్బంగా కీ రోల్ పోషించిన అనంతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు మరిచి పోలేని పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి ఎల్లకాలం రుణపడి ఉంటానని చెప్పింది. తనకు ఇచ్చిన పాత్ర శుద్ది లాంటి పాత్రపై వ్యాఖ్యానించింది. ఇలాంటి పాత్రను తాను పోషిస్తానని అనుకోలేదని పేర్కొంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొంది.