ల‌వ్ బ్రేక‌ప్ గుండె ల‌బ్ డ‌బ్ – అన‌న్య నాగ‌ళ్ల

ప్రేమ ఎంత మ‌ధురం ప్రియుడు క‌ఠినం

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌క్కువ కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు పొందింది అనన్య నాగ‌ళ్లు. త‌ను వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. అనుకోకుండా త‌ను కంట ప‌డ‌డంతో ద‌ర్శ‌కుడు మ‌ల్లేశం సినిమాకు ఎంపిక చేశాడు. ఇందులో ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర పోషించాడు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు ద‌క్కాయి. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌లో ఛాన్స్ లు వ‌చ్చాయి అన‌న్య నాగ‌ళ్ల‌కు. త‌న సాఫ్ట్ వేర్ జాబ్ ను వ‌దిలేసి పూర్తిగా సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టింది.

చాలా మ‌టుకు టాలీవుడ్ లో ఎక్కువ‌గా ముంబై , ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారే హీరోయిన్లుగా చెలామ‌ణి అవుతున్నారు. త‌ను న‌టిగానే కాదు మంచి స‌హృద‌యం క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందింది. త‌న సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని చారిటీల‌కు ఖ‌ర్చు చేస్తుంది. కానీ చేసిన సాయం గురించి బ‌య‌ట‌కు చెప్పుకునేందుకు ఇష్ట‌ప‌డ‌దు.

అన‌న్య నాగ‌ళ్ల మ‌ల్లేశం త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ , పొట్టేల్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. తాజాగా చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది ఈ అమ్మ‌డు. తొలి ప్రేమ దారుణంగా బెడిసి కొట్టింద‌ని వాపోయింది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా తంటాలు ప‌డ్డాన‌ని తెలిపింది. ప్రేమ ఎంత మ‌ధుర‌మో ప్రియుడు అంత క‌ఠిన‌మ‌ని పేర్కొంది.

Comments (0)
Add Comment