Ananya Panday: ‘కాల్‌ మీ బె’ అంటున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే !

‘కాల్‌ మీ బె’ అంటున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే !

Ananya Panday: బాలీవుడ్‌ నాయికలు దాదాపు ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడా జాబితాలోకే చేరింది కథానాయిక అనన్య పాండే. ‘కాల్‌ మీ బె’ సిరీస్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది అనన్య. అనివార్య కారణాల వల్ల కుటుంబానికి దూరమైన బెల్లా చౌదరీ అనే అమ్మాయి… ఒంటరిగా జీవిస్తూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందనే కథనంతో కొలిన్‌ డీ కున్హా రూపొందిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తాజాగా ఈ సిరీస్‌ సెప్టెంబరు 6 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ కొత్త ఫొటోను పంచుకుంది సిరీస్‌ బృందం. ఎనిమిది భాగాలుగా అభిమానుల ముందుకు రానున్న ఈ ప్రాజెక్టులో వీర్‌దాస్, వరుణ్‌ సూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ananya Panday Comment

‘లైగర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్య పాండే. ఆమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు, శరద్ పాండే మనుమరాలు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన లైగర్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

Also Read : Ajith Kumar: ట్రిపుల్ రోల్ లో అజిత్ కుమార్ ?

amazon primeAnanya PandayCall Me Bae
Comments (0)
Add Comment