Anchor Pradeep Sensational : ఎమ్మెల్యేతో పెళ్లిపై స్పందించిన ప్ర‌దీప్

ఇంకా ఆలోచించ లేదంటూ కామెంట్స్

Pradeep : ఓ వైపు యాంక‌ర్ గా మ‌రో వైపు యాక్ట‌ర్ గా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నాడు ప్ర‌దీప్ మాచిరాజు. ఈ మ‌ధ్య‌న త‌ను ఓ ఎమ్మెల్యేను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై స్పందించాడు. తాను కూడా ఈ విష‌యం తెలిసి ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం త‌ను ఓ సినిమా ప్రాజెక్టు ప‌నిలో బిజీగా ఉన్నాడు. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. దీనికి నితిన్ భ‌ర్త ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Anchor Pradeep Comment

ఈ సినిమాకు సంబధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్నాడు ప్ర‌దీప్ మాచిరాజు(Pradeep). మూవీ మేక‌ర్స్ ట్రైల‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. చిట్ చాట్ సంద‌ర్బంగా పెళ్లి గురించి ఎందుకు చెప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ఇవ‌న్నీ ఊహాగానాలేనంటూ కొట్టి పారేశాడు న‌టుడు. వీలు కుదిరిన‌ప్పుడు, స‌మ‌యం వ‌స్తే దానంతట అదే జ‌రుగుతుందంటూ పేర్కొన్నాడు. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం చూస్తే న‌వ్వు వ‌స్తోంద‌న్నాడు. ప్ర‌స్తుతం పెళ్లి అనే ఆలోచ‌న త‌న‌కు క‌ల‌గ‌డం లేద‌న్నాడు. త‌న ముందు కొన్ని టాస్క్స్ ఉన్నాయ‌ని, వాటిని నెర‌వేర్చ‌డంపైనే తాను ఫోక‌స్ పెట్టాన‌న్నాడు. వృత్తి ప‌రంగా ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నానంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. విచిత్రం ఏమిటంటే ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు రాసుకుంటున్నారు. పుకార్లు వ్యాపించేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. గ‌తంలో రియ‌ల్ ఎస్టేట్ కూతురితో పెళ్లి అని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేకు త‌న‌ను జ‌త క‌ట్టేశారంటూ ప్ర‌దీప్ న‌వ్వేశాడు.

Also Read : Anupriya Goenka Shocking : ఆ హీరో కార‌ణంగా చాలా ఇబ్బంది ప‌డ్డా

marriagePradeep MachirajuUpdatesViral
Comments (0)
Add Comment