Beauty Sreemukhi Apology : హిందూ సంఘాల‌కు శ్రీ‌ముఖి క్ష‌మాప‌ణ

తాను ఎవ‌రినీ కించ ప‌ర్చ‌లేద‌ని కామెంట్

Sreemukhi : శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. యాంక‌ర్ గా, న‌టిగా గుర్తింపు పొందింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇటీవ‌ల దిల్ రాజు నిర్మించిన విక్ట‌రీ వెంక‌టేశ్ , మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో జ‌రిగింది.

Sreemukhi Apologized..

ఈ కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది శ్రీ‌ముఖి(Sreemukhi). నిర్మాత‌లైన దిల్ రాజు, శిరీష్ ల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆ ఇద్ద‌రు రామ‌, ల‌క్ష్మ‌ణులు లాంటి వారంటూ ప్ర‌శంస‌లు కురిపించింది. వారిని మ‌నం చూడ‌లేద‌ని, కానీ ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య అస‌లైన రామ ల‌క్ష్మ‌ణులు దిల్ రాజు, శిరీష్ అంటూ పేర్కొంది.

దీంతో యాంక‌ర్ శ్రీ‌ముఖిపై హిందూ బంధువులు, హిందూ సంస్థ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. త‌క్ష‌ణ‌మే సారీ చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించింది శ్రీ‌ముఖి. తాను కావాల‌ని ఎవ‌రినీ ఉద్దేశించి అలా అన‌లేద‌ని పేర్కొంది. తాను కూడా హిందువునేన‌ని స్ప‌ష్టం చేసింది. తాను కూడా సంప్రాదాయాల‌ను, నాగ‌రిక‌త‌, సంస్కృతిని గౌర‌విస్తాన‌ని చెప్పింది.

ఎవ‌రైనా మ‌నోభావాలు దెబ్బ‌తింటే త‌న‌ను మ‌న్నించాల‌ని, త‌ప్పైంద‌ని ఇక నుంచి ఎలాంటి కామెంట్స్ చేయ‌నంటూ స్ప‌ష్టం చేసింది. త‌ను స్వ‌యంగా వీడియో ద్వారా విడుద‌ల చేసింది.

Also Read : Hero Siddharth-Miss You : ఓటీటీలో సిద్దార్థ్..ఆషికా మిస్ యూ

CommentsSreemukhiUpdatesViral
Comments (0)
Add Comment