Beauty Anupama Parameswaran : పీరియాడిక్ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్

శ‌ర్వానంద్ తో మ‌రోసారి జ‌త క‌ట్ట‌నున్న న‌టి

Anupama Parameswaran : ఎంచుకున్న పాత్ర‌కు న్యాయం చేసేందుకు ట్రై చేస్తుంది న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఈ ఏడాది ఆమెకు మంచి ఫీల్ క‌లిగించిన చిత్రం మారిముత్తు తీసిన డ్రాగ‌న్. ఇందులో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తో పాటు క‌యాదు లోహ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌న‌ను ప్రేమించే ప్రియురాలిగా అద్భుతంగా న‌టించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్(Anupama Parameswaran). సినిమాల ప‌రంగా ఎన్నో ఛాన్సులు వ‌చ్చినా త‌నకు న‌చ్చిన పాత్ర‌ల‌ను మాత్ర‌మే ఎంచుకుంటోంది. ఆ మ‌ధ్య‌న జొన్న‌ల‌గ‌డ్డ సిద్దుతో రెచ్చి పోయి న‌టించింది. అందాల‌ను ఆర‌బోసింది. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఓ పీరియాడిక‌ల్ మూవీ రాబోతోంద‌ని, ఇందులో శ‌ర్వానంద్ తో స్క్రీన్ పంచుకోనుంద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Anupama Parameswaran Movie Updates

విచిత్రం ఏమిటంటే శ‌ర్వానంద్ న‌క్క‌తోక‌ను తొక్కాడు. ఎవ‌రైనా ఒక్క సినిమా ఆడ‌క పోతే అటు వైపు ద‌ర్శ‌క , నిర్మాత‌లు చూడ‌రు. ప‌ట్టించుకోరు కూడా. కానీ వ‌రుస‌గా త‌ను న‌టించిన సినిమాలు బొక్క బోర్లా ప‌డుతున్నా వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి ఈ న‌టుడికి. ఇదే మిగ‌తా న‌టీ న‌టుల‌ను విస్తు పోయేలా చేస్తోంది. హిట్ వ‌స్తుంద‌ని ఆశ‌తో ఉన్నాడు. 2017 లో స‌తీష్ విఘ్నేష ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ‌త‌మానం భ‌వ‌తి సినిమా అద్భుత విజ‌యం అందుకుంది. ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకుంది. ఇది పూర్తిగా తెలుగు వారి సంప్ర‌దాయం, ఎన్నారైలు, కుటుంబీకుల మ‌ధ్య బంధాల‌ను తెర మీద ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. ఇందులో శ‌ర్వానంద్ తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ కీరోల్స్ పోషించారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన మూవీస్ ఏవీ వ‌ర్క‌వుట్ కాలేదు శ‌ర్వానంద్ కు. తాజాగా సంయుక్త మీన‌న్, సాక్షి వైద్య‌తో క‌లిసి నారీ నారీ న‌డుమ మురారిలో న‌టిస్తున్నాడు. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీలో న‌టించ‌నున్నాడు. ఇక 1960లో తెలంగాణ‌, మ‌రాఠా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్న యధార్థ ఘ‌ట‌న‌కు సంబంధించిన క‌థ ఆధారంగా సినిమా రాబోతోంద‌ని, ఇందులో శ‌ర్వానంద్ తో పాటు అనుప‌మ కూడా న‌టించ‌నుంద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది ఇప్పుడే చెప్ప‌లేం.

Also Read : Hero Ram Charan : రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు సిద్దం

Anupama ParameswaranMoviesUpdatesViral
Comments (0)
Add Comment