రాజ‌ధానిగా అమ‌రావ‌తిని గుర్తించండి

అమిత్ షాను కోరామ‌న్న చంద్ర‌బాబు

ఢిల్లీ – విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామ‌న్నారు సీఎం చంద్ర‌బాబు. లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తామ‌న్నారు. రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరడం జ‌రిగింద‌న్నారు. ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెడితే బాగుంటుంద‌ని చెప్పామ‌న్నారు. ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ మార‌బోతోంద‌న్నారు. కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభిస్తామ‌న్నారు.

2027 నాటికి పోలవరం పూర్తి అవుతుంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయిందంటూ ఆరోపించారు. గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామ‌న్నారు. ఢిల్లీ పర్యటనలో ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ కావ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం. రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించాల‌ని కోరామ‌ని తెలిపారు.

2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పదేళ్ల సమయం పడుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణ హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. గత పాలకులు రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారన్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశానని చెప్పారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామ‌న్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాల్సి ఉంద‌న్నారు.

రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరామ‌న్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. . సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామ‌న్నారు. సూర్యఘర్ కింద రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం కల్పించాలని సూచించామ‌న్నారు.

Comments (0)
Add Comment