భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం – ఎండీ

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం నెల‌కొంద‌ని తెలిపారు మేనేజింగ్ డైరెక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్. దీని పైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్త‌రించింద‌న్నారు. దీని ప్ర‌భావం కార‌ణంగా రెండు రోజుల పాటు ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తాయ‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

గంటకు 40-50 కిమీ వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని, ఎవ‌రూ కూడా చెట్ల కింద‌, శిథిలాల భ‌వ‌నాల వ‌ద్ద ఉండ కూడద‌ని సూచించారు ఎండీ. అత్యవసర సహాయం, సమాచారం కొరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 కు ఫోన్ చేయాల‌ని సూచించారు. వ‌ర్షాలు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు.

ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు వ‌స్తాయ‌ని జాగ్ర‌త్తగా ఉండాల‌న్నారు. కర్నూలు, వైఎస్సార్ తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయ‌న్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంద‌న్నారు.

Comments (0)
Add Comment