AP High Court : దేవర టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఇటీవల ఈ జీవోను సవాల్ చేస్తూ హై కోర్టులో పిల్ దాఖలైంది...

AP High Court : దేవర టికెట్స్ ప్రైజ్ విషయంలో ఏపీ ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నమోదైన పిల్‌పై సానుకూలంగా స్పందించి దేవర మేకర్స్‌కి షాక్ నిచ్చింది. కొన్ని రోజుల క్రితం భారీ బడ్జెట్ మూవీ కావడంతో దేవర టికెట్స్ ప్రైజ్ ను 14 రోజుల పాటు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మేకర్స్, జూనియర్ ఎన్టీయార్ తో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

AP High Court…

ఇటీవల ఈ జీవోను సవాల్ చేస్తూ హై కోర్టులో పిల్ దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం పిటిషినర్లతో ఏకీభవించింది. పద్నాలుగు రోజుల పాటు టికెట్స్ ప్రైజ్ ని పెంచుకోవచ్చు అన్నా ప్రభుత్వ ఆదేశాలను సవరిస్తూ 10 రోజులకు కుదించింది. దీంతో ఇది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read : Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా నుంచి సెకండ్ సింగల్

AP Hugh CourtCinemaDevara
Comments (0)
Add Comment