AP Mega DSC 2025 : అమరావతి – ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రకటించింది మెగా డీఎస్సీ. గత ప్రభుత్వం లో కొన్నింటిని మాత్రమే భర్తీ చేస్తే కూటమి సర్కార్ వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భారీ ఎత్తున మెగా డీఎస్సీని ప్రకటించింది. ఉపాధ్యాయ టీచర్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ చేసింది. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఇదిలా ఉండగా వీటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.
AP Mega DSC 2025 Last Date
ఇదిలా ఉండగా మెగా డీఎస్సీ(AP Mega DSC 2025) అప్లై చేసేందుకు మే 15న డెడ్ లైన్ విధించింది. అంతలోపు ఎవరైనా అభ్యర్థులు ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, పోస్టుల భర్తీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పోస్టులకు సంబంధించి మొత్తం 16 వేల 347 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్ 20వ తేదీన విద్యా శాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. కడపటి సమాచారం మేరకు 3,03,527 మంది అభ్యర్థులు టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ, ఎస్ఏ, పీజీటీ, టీజీటీలతో పాటు ఇతర ప్రత్యేక పోస్టులను భర్తీ చేయనుంది సర్కార్.
Also Read : TTD Sensational Decision :టీటీడీ నిర్ణయం బ్రేక్ దర్శనం పునః ప్రారంభం