కొడాలి నానిని అరెస్ట్ చేయ‌లేదు

పూర్తిగా క్లారిటీ ఇచ్చిన ఏపీ పోలీస్

అమ‌రావ‌తి – ఏపీ పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిని కోల్ క‌తా ఎయిర్ పోర్టులో తాము అదుపులోకి తీసుకున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు మాజీ మంత్రిని అదుపులోకి తీసుకోలేద‌న్నారు. ఒక‌వేళ అలా తీసుకున్న‌ట్ల‌యితే వెంట‌నే వివ‌రాలు తెలియ చేస్తామ‌న్నారు. అరెస్ట్ చేశాక వెంట‌నే కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఆయ‌న‌ను కోల్ క‌తా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నామ‌నేది పూ్ర్తిగా నిరాధార‌మ‌ని పేర్కొన్నారు. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ పోలీసులు స్పందించారు.

కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఆయ‌న కొంత కాలంగా తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆస్ప‌త్రికి వెళ్లి వ‌చ్చారు. త‌న‌కు ముంబైలో ఆప‌రేష‌న్ కూడా జ‌రిగింది.

Comments (0)
Add Comment