Apoorva Srinivasan: రహస్యంగా పెళ్లి చేసుకున్న ‘టెంపర్’ బ్యూటీ !

రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' బ్యూటీ !

Apoorva Srinivasan: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘టెంపర్’. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వ శ్రీనివాసన్. ఆ తరువాత ఈమె జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర చిత్రాల్లో పలు పాత్రలు చేసింది. ఈమె చివరగా 2022లో ‘నీతో’ సినిమా చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది.

Apoorva Srinivasan Sudden Marriage

అయితే ఒక్కసారిగా ఆమె పెళ్లి చేసుకుని నెట్టింట ప్రత్యక్షమయ్యింది. తన ప్రియుడు శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తితో రహస్యంగా ఏడడుగులు వేసింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఈ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ మాత్రమే హాజరైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఈ పెళ్లికి హాజరయింది.

Also Read : Vishal: వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నిశ్చితార్థంపై విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Apoorva SrinivasanTemper
Comments (0)
Add Comment