AR Rahman : లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చిత్రం ది థగ్ లైఫ్. దీనికి దర్శకత్వం వహించాడు మణిరత్నం. ఇందులో కీ రోల్ పోషించారు కమల్ హాసన్, త్రిష కృష్ణన్, సిలాంబరసన్. మూవీకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ది థగ్ లైఫ్ కోసం ప్రత్యేకంగా కథను రాశాడు కమల్ హాసన్. అంతే కాదు ఓ పాట కూడా తను రాయడం విశేషం. దీనికి అద్భుతమైన బాణీలు కట్టాడు రెహమాన్(AR Rahman). విచిత్రం ఏమిటంటే సుదీర్ఘ కాలం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి పని చేయడం. 30 ఏళ్ల కిందట నాయకుడులో నటించాడు. ఎందుకనో వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇది సినీ అభిమానులను ఆశ్చర్య పోయేలా చేసింది.
AR Rahman Jingucha Song Sensational
ఇక మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పని రాక్షసుడు. తనకు నచ్చిన సీన్ వచ్చేంత దాకా నిద్రపోడు. ఇతరులను నిద్రపోనివ్వడన్న పేరు కూడా ఉంది. తను త్రిష కృష్ణన్, చియాన్ , కార్తీ, ఐశ్వర్యా రాయ్ తో పొన్నియన్ సెల్వన్ చారిత్రాత్మక మూవీ తీశాడు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వస్తున్న చిత్రం ది థగ్ లైఫ్(Thug Life) . ఇందులో నటించిన త్రిష, శింబులు కూడా చాన్నాళ్ల తర్వాత తిరిగి తెరను పంచుకుంటుండడం విశేషం. తను పొన్నియన్ సెల్వన్ లో కూడా కీ రోల్ పోషించింది.
ఇక ది థగ్ లైఫ్ కు సంబంధించిన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. తాజాగా తమిళంలో విడుదల చేసిన పాటను హిందీలో జింగుచా పేరుతో సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ పాట సంగీత కచేరీలు, బరాత్ లు, ఈవెంట్స్ లో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తోంది. ఇందులో కమల్ హాసన్ , సిలాంబరసన్ , సన్యా మల్హోత్రా నటించారు.
Also Read : Sarangapani Jathakam Success :దూసుకు పోతున్న సారంగపాణి జాతకం