Tirumala Security Sensational :తిరుమ‌ల క్షేత్రంలో విస్తృత త‌నిఖీలు

పాకిస్తాన్ దాడుల నేప‌థ్యంలో అల‌ర్ట్

Tirumala : తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో భ‌క్తుల తాకిడి కొన‌సాగుతోంది. భారీ ఎత్తున భ‌ద్ర‌తా ద‌ళాలు మోహ‌రించాయి. విస్తృత త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఇండియా, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో ఇరు దేశాలు డ్రోన్ల‌తో దాడులు చేప‌ట్టాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు, ప్రార్థ‌నా మందిరాలు, దేవాల‌యాల‌లో క‌ట్టుదిట్టంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్య‌ద‌ర్శుల‌కు విస్తృత అధికారాలు క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Tirumala Security Sensational Checkings

దీంతో తిరుమలలో ఏరియా డామినేషన్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ మేర‌కు ఆక్టోప‌స్ , పోలీస్ , నిఘా , భ‌ద్ర‌తా విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ టీంలు, సిబ్బంది నాలుగు విభాగాలుగా విడి పోయారు. యుద్దం నేప‌థ్యంలో భ‌క్తుల్లో ధైర్యాన్ని పింపేలా దీనిని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు. త‌నిఖీల్లో భాగంగా శ్రీ‌వారి ఆల‌యం, బ‌స్టాండ్, రాం భ‌గీచ‌, కాటేజీలు, ఇత‌ర ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టారు. తిరుమ‌ల‌కు నిత్యం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు డీఎస్పీ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు.

Also Read : Hero Rajinikanth-Coolie Teaser :త‌లైవా ర‌జ‌నీకాంత్ కూలీ టీజ‌ర్ సూప‌ర్

Operation SindoorPahalgam AttackSecurityTirumalaUpdatesViral
Comments (0)
Add Comment