Hero Kalyanram-Arjun s/o Vyjayanthi :అనుబంధానికి పెద్ద‌పీట అర్జున్ స‌క్సెస్ బాట

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న క‌ళ్యాణ్ రామ్ మూవీ

Arjun s/o Vyjayanthi : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , స‌యీ మంజ్రేకర్, రాముల‌మ్మ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించిన చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి(Arjun s/o Vyjayanthi) మూవీ. విడుద‌లైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్ర‌త్యేకించి త‌ల్లీ కొడుకుల సెంటిమెంట్ ను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇందులో బ‌బ్లూ పృథ్వీ రాజ్ , శ్రీ‌కాంత్, సొహైల్ ఖాన్ ఇత‌ర పాత్ర‌ల‌లో మెరిశారు. మ‌రో వైపు గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో విజ‌య‌శాంతి మ‌రోసారి త‌న ప‌వ‌ర్ ఫుల్ కేరెక్ట‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కొన్ని సీన్స్ లో ఆమె హైలెట్ గా నిలిచారు.

Arjun s/o Vyjayanthi Movie Talk

పోరాట స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా తీశాడు ద‌ర్శ‌కుడు. క‌ళ్యాణ్ రామ్, రాములమ్మ మ‌ధ్య తీసిన సీన్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది థియేట‌ర్ల‌లో. ప్రేమ‌తో పాటు కోపాన్ని ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో కూడా త‌న‌దైన రీతిలో చేసింద‌న్న ప్ర‌శంస విజ‌య‌శాంతికి ల‌భిస్తోంది. గ‌తంలో ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌లో న‌టించింది..మెప్పించింది . కానీ అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీలో మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్ గా ఉంద‌ని అంటున్నారు అభిమానులు. ఇందులో పోషించిన పాత్ర‌కు మంచి స‌పోర్ట్ ల‌భించ‌డం విశేషం.

ఇక పోతే ప‌వ‌ర్ పోలీస్ పాత్ర అయినా , ప్ర‌తి నాయ‌కి పాత్ర అయినా ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు విజ‌య‌శాంతి. ఇందులో ఇచ్చిన పాత్ర‌కు ఆమె న్యాయం చేసింది. త‌న‌ను గుర్తుంచుకునేలా న‌టించింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఆమె కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి త‌న‌ను ఒప్పించి మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వరు అనే మూవీలో రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. ఇప్పుడు దానికంటే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర రాముల‌మ్మ‌కు ద‌క్క‌డం, దానికి అప్లాజ్ రావ‌డంతో విజ‌య‌శాంతి సంతోషానికి లోన‌వుతున్నారు.

Also Read : Hero Nithin-Robinhood OTT :మేలో ఓటీటీలోకి రానున్న రాబిన్ హుడ్ 

Arjun s/o VyjayanthiCinemaTrendingUpdates
Comments (0)
Add Comment