Arjun Sarja: అర్జున్‌ సర్జా ఇంట ప్రారంభమైన పెళ్లి వేడుకలు !

అర్జున్‌ సర్జా ఇంట ప్రారంభమైన పెళ్లి వేడుకలు !

Arjun Sarja: దక్షిణాది భాషల యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్‌ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్‌ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్‌ హీరో ఉమాపతితో జూన్‌ 10న చెన్నైలోని హనుమాన్‌ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో అర్జున్ సర్జా ఇంట పెళ్ళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెళ్ళి వేడుకల్లో భాగంగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారుతున్నాయి. అందులో అర్జున్‌ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్‌ మ్యారేజ్‌… ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిపారు.

Arjun Sarja..

ఇక ఐశ్వర్య సినిమాల విషయానికి వస్తే… ఐశ్వర్య కెరీర్‌ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్‌ డైరెక్టర్‌ గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్‌ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అర్జున్ సర్జా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

Also Read :  Premgi Amaren: లేటు వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ !

Arjun SarjaIswarya Sarja
Comments (0)
Add Comment