Arjun Son of Vyjayanthi Sensational :అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి సూప‌ర్ క‌లెక్ష‌న్స్

కాసుల వేటలో దూసుకు పోతున్న మూవీ

Arjun Son of Vyjayanthi : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి, బాలీవుడ్ యాక్ట‌ర్ మంజ్రేక‌ర్ క‌లిసి న‌టించిన చిత్రం అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి(Arjun s/o Vyjayanthi) ప్రేక్ష‌కుల ముందుకు విడుద‌లై కాసుల వేట కొన‌సాగిస్తోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ. 12.85 కోట్లు వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేసింది. ద‌ర్శ‌కుడు చిత్రాన్ని పూర్తిగా యాక్ష‌న్, సెంటిమెంట్, థ్రిల్ల‌ర్ గా రూపొందించాడు. ప్ర‌ధానంగా త‌ల్లీ కొడుకుల మ‌ధ్య ఉన్న బంధాన్ని హైలెట్ చేశారు. జ‌నం మెల మెల్ల‌గా రావ‌డం మొద‌లు పెట్టారు.

Arjun Son of Vyjayanthi Movie Sensational Collections

ప్ర‌ధానంగా నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఈ మూవీ ఆశించిన దానికంటే ఎక్కువ‌గా వ‌సూలు కావ‌డం ప‌ట్ల మూవీ మేక‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేశారు. పూర్తిగా మాస్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటోంది. చ‌క్క‌టి సినిమాటిక్ అనుభ‌వాన్ని అందించింది. తొలి వారాంతంలో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా వ‌సూలు చేసింది అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి. ప్ర‌దీప్ చిలుకూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మంచి పాయింట్ ను అద్భుతంగా ప్ర‌జెంట్ చేశాడు.

ఇక చిత్రానికి హైలెట్ గా నిలిచారు విజ‌య‌శాంతి. త‌ను గ‌తంలో మ‌హేష్ బాబు న‌టించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసింది. ఇప్పుడు అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతిలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో మెప్పించింది. క‌ళ్యాణ్ రామ్ కొడుకుగా రాముల‌మ్మ త‌ల్లిగా స్క్రీన్ పై పండించారు. సెంటిమెంట్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది.

Also Read : Popular Music Director Ilayaraaja :సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు

Arjun s/o VyjayanthiCinemaCollectionsTrending
Comments (0)
Add Comment