Ashok Selvan Marries : ఒక్క‌టైన అశోక్ సెల్వ‌న్..కీర్తి పాండ్య‌న్

సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్

Ashok Selvan Marries : ప్ర‌ముఖ న‌టీన‌టులు అశోక్ సెల్వ‌న్, కీర్తి పాండ్యన్ లు ఒక్క‌ట‌య్యారు. బుధ‌వారం ఈ వేడుకుల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌య్యాయి. ఈ ఇద్ద‌రి పెళ్లి తిరునెల్వేలిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెల్ల‌టి దుస్తుల‌తో ఆక‌ట్టుకున్నారు ఈ కొత్త జంట‌.

Ashok Selvan Marries Keerthy Pandiyan

తామిద్ద‌రి ఇన్ స్టా గ్రామ్ లో ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ రాశారు. రాగిలో నీరు లాగా ప్రేమ హృద‌యం మిశ్రమంగా ఉందంటూ పేర్కొన్నారు. అశోక్ సెల్వ‌న్(Ashok Selvan) , కీర్తి పాండ్య‌న్ లు ఒక్క‌టి కావ‌డంతో ఈ జంట‌ను సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు అభినంద‌ల‌తో ముంచెత్తారు.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన ఐశ్వ‌ర్య ల‌క్ష్మి కంగ్రాట్స్ తెలిపింది. ప్ర‌ముఖ సింగ‌ర్ బృందా శివ‌కుమార్ మీ ఇద్ద‌రూ క‌ల‌కాలం సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరారు. ఎంత‌టి అద్భుత‌మైన పెళ్లి అని కితాబు ఇచ్చారు మిథిలా పాల్క‌ర్ . మ‌రో ప్ర‌ముఖ న‌టి మంజిమా మోహ‌న్ కొత్త జంట‌కు విషెస్ తెలిపారు.

ఇదిలా ఉండ‌గా కీర్తి పాండ్య‌న్ 2019లో తుంబా చిత్రంలో తొలిసారిగా న‌టించింది. బ్లూ స్టార్ ప్రాజెక్టులో క‌నిపించ‌నుంది.

Also Read : Leo Movie Record : విజ‌య్ లియో రికార్డ్ బ్రేక్

Comments (0)
Add Comment